కీవ్, మే 11: ఖార్కీవ్ సమీపంలోని నాలుగు గ్రామాల నుంచి రష్యా బలగాలను ఉక్రెయిన్ సేనలు తరిమికొట్టాయని అధ్యక్షుడు జెలెన్స్కీ బుధవారం ప్రకటించారు. మరియుపోల్‌లోని స్టీల్ ప్లాంట్ కూడా తమ ఆధీనంలోనే ఉన్నట్టు వెల్లడించారు.
మరోవైపు, గడిచిన 24 గంటల్లో దేశంలోని ప్రధాన ప్రాంతాలపై 34 సార్లు రష్యా యుద్ధ విమానాలు దాడులకు తెగబడ్డాయని ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. ఐరోపా దేశాలకు రష్యా సరఫరా చేస్తున్న గ్యాస్‌ను అడ్డుకొన్నట్టు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు.