Kaali Maata | కీవ్: కాళీమాత పట్ల అనుచితంగా ప్రవర్తించడంపై ఉక్రెయిన్ క్షమాపణలు చెప్పింది. కాళీమాతపై ట్విట్టర్లో అనుచితంగా పోస్టు చేయటం పట్ల తాము చింతిస్తున్నట్టు ఉక్రెయిన్ డిప్యూటీ విదేశీ వ్యవహారాల మంత్రి ఎమినె డిజెపార్ తెలిపారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ఉక్రెయిన్, ఇక్కడి ప్రజలు గౌరవిస్తారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె మంగళవారం ట్వీట్ చేశారు.
ఆ పోస్టును ఇప్పటికే తొలగించామన్నారు. భారత్ అందిస్తున్న సాయం పట్ల ఉక్రెయిన్ ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. రష్యా చమురు డిపోలపై ఉక్రెయిన్ దాడులు చేయగా అక్కడ వెలువడ్డ పొగను అమెరికా నటి మార్లిన్ మన్రో స్కర్ట్గా వేసుకున్నట్టు ఓ ఫొటోను రూపొందించారు. సదరు నటి స్థానంలో కాళీమాత ఉన్నట్టు ఫొటోను మార్ఫింగ్ చేశారు.