రష్యాతో చర్చలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంగీకరించారు. బెలారస్లో రష్యా, ఉక్రెయిన్ మధ్య చర్చలు జరగనున్నాయని రష్యన్ మీడియా మాస్కోలో ప్రకటించింది. చర్చల కోసం బెలారస్‌కు ఉక్రెయిన్ బృందం బయలుదేరింది. బెలారస్‌లోని గోమెల్లో రష్యా, ఉక్రెయిన్ మధ్య చర్చలు జరగనున్నాయి.
ఉక్రెయిన్ చర్చలకు అంగీకరించినప్పటికీ.. ఇప్పటికే జరగరాని నష్టం జరిగింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో సహా పలు నగరాలను రష్యా సైనికులు హస్తగతం చేసుకున్నారు. యుద్ధం వల్ల ఉక్రెయిన్‌కు చాలా నష్టం వాటిల్లింది. ఉక్రెయిన్ వాసులు.. తమ ఇళ్లు వదిలి ప్రాణభయంతో పొరుగు దేశాలకు వలస వెళ్లారు. ఈ పరిస్థితుల్లో చర్చలకు తాము సిద్ధం అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు.