లండన్: నాటింగ్హమ్లో ఓ దుండగుడు జరిపిన దాడిలో ముగ్గురు చనిపోగా, మృతుల్లో ఒకరు భారత సంతతి యువతి(19) ఉన్నారని స్థానిక పోలీస్ అధికారులు బుధవారం వెల్లడించారు. యూనివర్సిటీ ఆఫ్ నాటింగ్హమ్లో మొదటి సంవత్సరం పూర్తిచేసుకున్న బార్నబీ వెబర్ (19), భారత సంతతి యువతి గ్రేస్ ఓమాలే కుమార్ (19)లపై దుండగుడు కత్తితో దాడిచేశాడని, అటు తర్వాత ఓ వ్యాన్ డ్రైవర్పైనా దాడికి తెగబడి చంపేశాడని పోలీసులు తెలిపారు.
నాటింగ్హమ్ హత్యాకాండ ఘటనతో బ్రిటన్ యావత్తు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గ్రేస్ ఓమాలే కుమార్ క్రికెటర్గా, హాకీ క్రీడాకారిణిగా మంచి గుర్తింపు అందుకున్నారు. దుండగుడ్ని అదుపులోకి తీసుకున్నామని,దాడి వెనుక ఉగ్రకుట్ర ఏదైనా ఉందన్న విషయంపై కౌంటర్ టెర్రరిజం పోలీస్ విభాగం విచారణ జరుపుతున్నదని నాటింగ్హమ్షైర్ పోలీస్ చీఫ్ కానిస్టేబుల్ చెప్పారు.