e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, December 5, 2021
Home News బ్రిట‌న్ ఎంపీ డేవిడ్ అమీస్ దారుణ హ‌త్య‌

బ్రిట‌న్ ఎంపీ డేవిడ్ అమీస్ దారుణ హ‌త్య‌

ఇంగ్లండ్ : బ్రిట‌న్ ఎంపీ డేవిడ్ అమీస్ దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. స్థానిక లీ-ఆన్-సీలోని చ‌ర్చిలో డేవిడ్ అమీస్ ప్రార్థ‌న‌లు చేస్తుండ‌గా గుర్తు తెలియ‌ని దుండ‌గులు క‌త్తితో దాడి చేశారు. దీంతో ఎంపీకి తీవ్ర ర‌క్త‌స్రావం కావ‌డంతో చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ బ్రిట‌న్ ఎంపీ తుదిశ్వాస విడిచారు.

పౌరుల‌తో క‌లిసి వారాంత‌పు స‌మావేశంలో పాల్గొనేందుకు అమీస్ చ‌ర్చికి వ‌చ్చారు. డేవిడ్ అమీస్ హ‌త్య‌ను ఉగ్ర‌వాద చ‌ర్య‌గా బ్రిట‌న్ పోలీసులు పేర్కొన్నారు. ఈ హ‌త్య కేసులో ఒక‌రిని అరెస్టు చేసిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. ఎసెక్స్‌లోని సౌంత్ ఎండ్ వెస్ట్ నుంచి డేవిడ్ అమీస్ పార్ల‌మెంట్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. బ్రిట‌న్ ప్ర‌ధాని జాన్స‌న్‌కు చెందిన క‌న్జ‌ర్వేటివ్ పార్టీ నేత డేవిడ్ అమీస్. 1983 నుంచి బ్రిట‌న్ ఎంపీగా కొన‌సాగుతున్నారు. జంతు స‌మ‌స్య‌లు, గ‌ర్భ‌స్రావాల‌కు వ్య‌తిరేకంగా డేవిడ్ అమీస్ పోరాడారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement