UK Protests | శరణార్ధులు తలదాచుకున్న హోటల్ మీద దాడులు చేయడాన్ని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తీవ్రంగా ఖండించారు. దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో శరణార్థులను లక్ష్యంగా చేసుకున్న దాడులను ‘అతివాద దోపిడీ (far-right thuggery)’ అని అభివర్ణించారు. అశాంతికి కారణమైన వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పలు నగరాల్లో దాడులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
హింసాత్మక ఘటనల కారకులను అరెస్ట్ చేస్తున్నట్లు కీర్ స్టార్మర్ తెలిపారు. ఇవి వ్యవస్థీకృతమైన దాడులని పేర్కొన్నారు. ఈ తరహా సంఘటనలకు తావు లేదని స్పష్టం చేసిన కీర్ స్టార్మర్.. ఇందులో భాగస్వాములైన వ్యక్తులు చింతించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఇంగ్లండ్‌లో ఓ డ్యాన్స్ క్లాస్ మీద దాడులు చేసిన ఆగంతకులు బాలలపై కత్తులతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ సంఘటనలో ముగ్గురు బాలలు మరణించడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. పలు నగరాల్లో వలస వాద వ్యతిరేక టీమ్స్ నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నిరసనలు, దాడులకు సంబంధించి సుమారు 87 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Citroen Basalt | సిట్రోన్ బసాల్ట్ ఎస్యూవీ కూపే ఆవిష్కరణ.. ఇవీ డిటెయిల్స్.. !
Hyundai Venue | హ్యుండాయ్ వెన్యూ అప్ డేటెడ్ వర్షన్ వెన్యూ ఎస్ (ఓ)+.. ధరెంతంటే..?!
World Bank – India | ప్రపంచ బ్యాంకు సంచలన వ్యాఖ్యలు.. భారత్ ఆ స్థాయికి చేరుకోవాలంటే..!