Tattoos | కూతురిపై ప్రేమ.. ఒంటిపై 600కిపైగా టాటూలతో వరల్డ్ రికార్డు
Tattoos | టాటూలు (Tattoos) ఇప్పుడు ఇదే నయా ట్రెండ్. శరీరం మీద ఎన్ని ఎక్కువ టాటూలు ఉంటే అంత మాడ్రన్. ప్రస్తుతం యువతీ యువకులు వాటి పట్ల బాగా ఆకర్షితులవుతున్నారు. తాజాగా యూకే (UK)కి చెందిన ఓ వ్యక్తి తన కుమార్తెపై ఉన్న ప్రేమని పచ్చబొట్టు రూపంలో చూపించి ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు (Guinness World Records)లో చోటు సంపాదించుకున్నాడు.
Tattoos | టాటూలు (Tattoos) ఇప్పుడు ఇదే నయా ట్రెండ్. శరీరం మీద ఎన్ని ఎక్కువ టాటూలు ఉంటే అంత మాడ్రన్. ప్రస్తుతం యువతీ యువకులు వాటి పట్ల బాగా ఆకర్షితులవుతున్నారు. దేవుళ్లు, కార్టూన్లు, అందమైన పెయింటింగ్‌లే కాదు.. తమకు ఇష్టమైన, ప్రియమైన వారి పేర్లను పచ్చబొట్టుగా ఒంటిపై వేయించుకుంటున్నారు. అయితే, ఒకటో రెండో ఉంటే పర్వాలేదు కానీ శరీరమంతా పచ్చబొట్లే వేయించుకుంటున్నారు. తాజాగా యూకే (UK)కి చెందిన ఓ వ్యక్తి కూడా అలానే వేయించుకున్నాడు. తన కుమార్తెపై ఉన్న ప్రేమని పచ్చబొట్టు రూపంలో చూపించి ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు (Guinness World Records)లో చోటు సంపాదించుకున్నాడు.
కూతురంటే తండ్రికి అమితమైన ప్రేమ ఉంటుంది. వారి మధ్య బంధం విడదీయరానిది. యూకే కి చెందిన 49 ఏళ్ల మార్క్ ఓవెన్ ఎవాన్స్ (Mark Owen Evans)కు కూడా తన కూతురంటే చాలా ఇష్టం. ఈ క్రమంలోనే తన కుమార్తె లూసీ పేరును తన ఒంటిపై ఏకంగా 667 సార్లు పచ్చబొట్లుగా వేయించుకుని గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాడు. ఎవాన్స్ 2017లోనే తొలిసారి వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. అప్పుడు కుమార్తె లూసీ పేరును తన వీపుపై 267 సార్లు టాటూలుగా వేయించుకున్నాడు. దీంతో అప్పట్లో ఆయనకు వరల్డ్ రికార్డులో చోటు దక్కింది.
అయితే, ఆ రికార్డు 2020లో బద్దలైంది. అమెరికన్ డైడ్రా విజిల్ అనే మహిళ తన పేరును 300 సార్లు టాటూ వేయించుకుని కొత్త రికార్డును నెలకొల్పింది. ఇది తెలుసుకున్న ఎవాన్స్.. డైడ్రా రికార్డును బద్దలు కొట్టాలనుకున్నాడు. ఈ క్రమంలోనే తన కూతురి పేరును 400 సార్లు టాటూ వేయించుకున్నాడు. అయితే, ఈ సారి శరీరంపై ఖాళీ లేకపోవడంతో తన రెండు తొడలపై పచ్చబొట్టు వేయించుకున్నాడు. రెండు తొడలపై మొత్తం 400 టాటూలు వేయించుకున్నాడు. దీంతో గతంలో వేయించుకున్న 267 టాటూలు, ఈ 400 కలిపి మొత్తం ఎవాన్స్ శరీరంపై 667 టాటూలు ఉన్నాయి. దీంతో ఎవాన్స్‌కు మరోసారి గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కింది.
Also Read..
Google Lay Offs | ఉద్యోగులకు మరోసారి షాక్ ఇచ్చిన గూగుల్.. వందలాది మందిపై వేటు
Boat Capsize | పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న పడవ బోల్తా.. 12 మంది మిస్సింగ్
Luxury Cruise | 206 మంది ప్రయాణికులతో వెళ్తూ.. సముద్రంలో చిక్కుకుపోయిన లగ్జరీ క్రూయిజ్ షిప్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

