Google Lay Offs | ఉద్యోగులకు మరోసారి షాక్ ఇచ్చిన గూగుల్.. వందలాది మందిపై వేటు
Google Lay Offs | ఆర్థిక మాంద్యం ముప్పు భయాలు టెక్ దిగ్గజ సంస్థలను వదలట్లేదు. చాలా కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ (Google) మరోసారి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది.
Google Lay Offs | ఆర్థిక మాంద్యం ముప్పు భయాలు టెక్ దిగ్గజ సంస్థలను వదలట్లేదు. చాలా కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. అమెజాన్, గూగుల్, ట్విట్టర్, మైక్రోసాఫ్ట్ సహా ప్రముఖ సంస్థలు భారీ ఎత్తున ఉద్యోగులను తగ్గించుకున్న విషయం తెలిసిందే. ఆదాయం తగ్గడంతో ఖర్చు తగ్గింపులో భాగంగానే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు చెబుతున్నాయి. మరికొన్ని కంపెనీలు కూడా అదేబాటలో పయనిస్తున్నాయి. విడతల వారీగా ఉద్యోగుల్ని ఇంటికి పంపించేస్తున్నాయి. తాజాగా ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ (Google) మరోసారి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది.
గూగుల్ పేరెంట్ కంపెనీ అల్ఫాబెట్ (Alphabet ).. రిక్రూట్మెంట్ విభాగంలో వందలాది మందికి లేఆఫ్స్ (Lay Offs) ప్రకటించింది. ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ఈసారి వందలాది మంది ఉద్యోగుల్ని తొలగించినట్లు సంస్థ పేర్కొంది. వీరిలో చాలా మంది గ్లోబల్ రిక్రూట్మెంట్ టీమ్ నుంచి ఉన్నట్లు వెల్లడించింది. కొత్తగా నియామకాలను కూడా తగ్గించినట్లు అల్ఫాబెట్ చెప్పినట్లు రాయిటర్స్ నివేదించింది. ఈ మేరకు ఉద్యోగులకు మెయిల్ ద్వారా లేఆఫ్స్ సమాచారాన్ని బుధవారం అందించినట్లు పేర్కొంది.
ప్రస్తుత త్రైమాసికంలో ఉద్యోగులకు లేఆఫ్స్ విధించిన అతిపెద్ద టెక్ కంపెనీ అల్ఫాబెట్ కావడం గమనార్హం. మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు 2023 ప్రారంభంలో భారీ స్థాయిలో ఉద్యోగుల్ని తొలగించాయి. అల్ఫాబెట్ కూడా ఇప్పటికే ఈ సంవత్సరం జనవరిలో తమ వర్క్ ఫోర్స్లో 6 శాతం (12 వేల మంది) ఉద్యోగుల్ని ఇంటికి పంపించింది.
Also Read..
Boat Capsize | పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న పడవ బోల్తా.. 12 మంది మిస్సింగ్
Luxury Cruise | 206 మంది ప్రయాణికులతో వెళ్తూ.. సముద్రంలో చిక్కుకుపోయిన లగ్జరీ క్రూయిజ్ షిప్
Jawan Movie | జవాన్ చిత్రంపై బన్నీ రివ్యూ.. షారుఖ్ మాస్ అవతార్ అంటూ ట్వీట్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

