H-1B Visa Fee: హెచ్-1బీ వీసా ఫీజు పెంపును వ్యతిరేకిస్తూ కోర్టులో కేసు వేసిన అమెరికా రాష్ట్రాలు
H-1B Visa Fee: హెచ్-1బీ వీసా ఫీజును ట్రంప్ పెంచిన విషయం తెలిసిందే. ఆ ఎత్తుగడకు బ్రేక్ వేయాలని అమెరికా రాష్ట్రాలు ప్రయత్నించాయి. బోస్టన్ కోర్టులో సుమారు 19 రాష్ట్రాలు వీసా ఫీజు పెంపును వ్యతిరేకిస్తూ కేసు దాఖలు చేశాయి.
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా ఫీజు(H-1B Visa Fee)ను లక్ష డాలర్లకు పెంచిన విషయం తెలిసిందే. అయితే ట్రంప్ చర్యను ఖండిస్తూ అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించాయి. కాలిఫోర్నియాతో పాటు 19 రాష్ట్రాలు శుక్రవారం ట్రంప్ ఆదేశాలకు వ్యతిరేకంగా పరిహారం కేసు వేశాయి. విదేశీ నైపుణ్య వర్కర్ల జారీ చేసే హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచడాన్ని ఆయా రాష్ట్రాలు వ్యతిరేకించాయి.తాజాగా బోస్టన్ కోర్టులో కేసు వేశారు. సెప్టెంబర్‌లో ఫీజును పెంచిన విషయం తెలిసిందే. ఆ ఫీజుకు వ్యతిరేకంగా ఇప్పటికే బోస్టన్ కోర్టులో మూడు కేసులు దాఖలయ్యాయి. దేశాధ్యక్షుడు రాజ్యాంగాన్ని విస్మరించరాదు అని ఆ రాష్ట్రాలు తమ పిటీషన్లో పేర్కొన్నాయి.
ఫెడరల్ చట్టాలను ఉల్లంఘించి వీసా ఫీజును పెంచినట్లు కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బోంటా వాదించారు. ఆదాయం రాబట్టేందుకు దేశాధ్యక్షుడు ఏకపక్షంగా ఛార్జీలను పెంచడం అమెరికా రాజ్యాంగానికి వ్యతిరేకం అన్నారు. ఫీజును పెంచే అధికారం అమెరికా ఉభయసభల వద్ద ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. లక్ష ఫీజు వసూల్ చేయడం వల్ల కంపెనీలపై ఆర్థిక భారం పడుతుందని, ఉద్యోగులకు నిత్యావసర సర్వీసులను అందించడం కష్టం అవుతుందని, విద్యా, ఆరోగ్యం లాంటివి కూడా సమస్యాత్మకం అవుతాయని బోంటా తెలిపారు. కాలిఫోర్నియాతో పాటు న్యూయార్క్, మాసాచుసెట్స్, ఇలియనాస్, న్యూజెర్సీ, వాషింగ్టన్ రాష్ట్రాలు ట్రంప్ ఆదేశాలను కోర్టులో సవాల్ చేశాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

