న్యూయార్క్, జూలై 11: అమెరికాలోని న్యూయార్క్‌లో ఆకాశంలో రెండు విమానాలు ఢీకొనబోయాయి. న్యూయార్క్‌లోని సిరక్యూస్లో పోలీస్ శాఖకు చెందిన పెట్రోలింగ్ వాహనంలోని డాష్ కెమెరా ఈ దృశ్యాన్ని బంధించింది.
ఈ నెల 8న ఈ రెండు ప్రయాణికుల విమానాలు ఇంచుమించు ఒకదానికొకటి ఢీకొనేంత దగ్గరగా వచ్చినా వెంట్రుకవాసిలో ప్రమాదం నుంచి బయటపడ్డాయి. సిరక్యూస్ హన్‌కాక్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఒకే రన్‌వేపైకి ఏకకాలంలో ల్యాండింగ్, టేకాఫ్‌కు అనుమతి ఇస్తూ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది చేసిన తప్పిదం కారణంగానే ఇది సంభవించి ఉంటుందని భావిస్తున్నారు.