న్యూయార్క్, జూలై 11: అమెరికా మానిటరీ పాలసీ టాస్క్‌ఫోర్స్‌లో రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌తోపాటు మరో ఇద్దరు భారతీయులు చోటు దక్కించుకున్నారు. యూఎస్ ఫెడరల్ రిజర్వు చైర్మన్ కేవిన్ వార్ష్ ఐదుగురు సభ్యులతో కూడిన మానటరి పాలసీ టాస్క్‌ఫోర్స్‌ను ప్రకటించారు.
ఈ టాస్క్ ఫోర్స్‌లో రఘురామ్ రాజన్‌తోపాటు హార్వర్డ్ యూనివర్సిటీ ఎకనమిక్స్ ప్రొఫెసర్ రాజ్ శెట్టి, మైక్రోసాఫ్ట్ ఎక్స్‌బాక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి ఆశా శర్మలు కూడా ఎంపికయ్యారు. రాజన్ నాయకత్వం వహించనున్న ఈ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఫెడ్ బ్యాలెన్స్ షీట్ విధానానికి సంబంధించిన వ్యయాలు, ప్రయోజనాలు, సంస్థాగత పర్యవసానాలను పరిశీలించాల్సి ఉంటుంది.