ఎదులాపురం, జూలై 11: ప్రజలకు నాణ్యమైన, సమర్థవంతమైన పోలీసింగ్ అందించడమే ప్రతి పోలీస్ అధికారి ప్రధాన లక్ష్యంగా ఉండాలని బాసర జోన్ డీఐజీ భాసరన్ పేరొన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా పోలీసు ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో జిల్లా పోలీసు అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. జిల్లాకు నూతనంగా విచ్చేసిన డీఐజీకి ఎస్పీ అఖిల్ మహాజన్ పూలమొక అందజేసి స్వాగతం పలికారు. అనంతరం డీఎస్పీలు, సీఐ లు, ఎస్హెచ్ఓలతో సమావేశమై జిల్లాలో శాంతిభద్రతలు, నేర నియంత్రణ, పోలీస్ స్టేషన్ల పనితీరు, ప్రత్యేక డ్రైవ్‌పై సమీక్ష నిర్వహించారు.
సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేసి నేరాలను ముందుగానే గుర్తించి అరికట్టాలని సూచించారు. బేసిక్, విజిబుల్, ప్రో-యాక్టివ్ పోలీసింగ్‌ను సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజ ల్లో భద్రతాభావాన్ని పెంపొందించాలని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్‌మహాజన్‌తో కలిసి పోలీస్ గెస్ట్ హౌస్ ప్రాంగణంలో మొక నాటారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ (పరిపాలన) మౌనిక, ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే, డీఎస్పీలు ఎల్. జీవన్‌రెడ్డి, ఎం. వెంకటనరసయ్య, కమతం ఇంద్రవర్ధన్, పోలీస్ కార్యాలయ ఏవో శివకుమార్, సూపరింటెండెంట్లు సులోచన, సంజీవ్, తదితరులు పాల్గొన్నారు.