టెహ్రాన్: జలసంధిని వాణిజ్య నౌకల రాకపోకలకు తెరిచామంటూ ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో హొర్ముజ్ను దాటేందుకు ప్రయత్నిస్తున్న భారత నౌకలపై ఇరాన్ నేవీ కాల్పులు జరిపింది. దీనికి నిరసనగా భారత్లోని ఇరాన్ రాయబారికి కేంద్రం నోటీసులు జారీ చేసింది. హొర్ముజ్ జలసంధిని తెరచినట్టు ప్రకటించిన ఇరాన్ 24 గంటలు కూడా కాకముందే దానిని మూసివేసింది.
అదే సమయంలో జలసంధి మీదుగా వెళ్లేందుకు జగ్ అర్నవ్, సాన్మర్ హెరాల్డ్ అనే రెండు భారత్ నౌకలు ప్రయత్నించాయి. వాటిలో జగ్ అర్నవ్పై ఇరాన్ నౌకా దళం కాల్పులు జరిపింది. హొర్ముజ్ జలసంధి వద్ద ఒమన్ ఉత్తర దిశలో ఉండగా ఇరాన్ ఈ కాల్పులకు పాల్పడింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడ లేదు. కాల్పులతో ఈ రెండు నౌకలు తిరిగి వెనక్కి వెళ్లినట్టు తెలుస్తున్నది.