ఒట్టావా: కెనడా నూతన ప్రధాన మంత్రి మార్క్ కార్నీ మంత్రివర్గంలో ఇద్దరు భారత సంతతి ఎంపీలకు స్థానం లభించింది. ఇండో-కెనడియన్ అనిత ఆనంద్, ఢిల్లీలో జన్మించిన కమల్ ఖేరాలకు మంత్రి పదవులు లభించాయి. కార్నీ, ఆయన మంత్రివర్గ సభ్యులు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు.
అనితకు ఇన్నోవేషన్, సైన్స్, పరిశ్రమల శాఖ, కమల్ ఖేరాకు ఆరోగ్య శాఖ ఇచ్చారు. మంత్రి పదవులను నిలబెట్టుకున్న కొద్ది మందిలో వీరిద్దరూ ఉన్నారు. కమల్ బాల్యంలోనే ఆమె తల్లిదండ్రులు కెనడాకు వలస వెళ్లారు. పార్లమెంటుకు ఎన్నికైన అత్యంత పిన్న వయస్కులైన మహిళలలో ఆమె ఒకరు. లిబరల్ పార్టీలో ప్రధాని పదవికి పోటీలో ముందున్న అనిత జనవరిలో తాను పోటీలో లేనని ప్రకటించారు.