మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ గురువారం ప్రపంచవ్యాప్తంగా 45 నిమిషాలపాటు మూగబోయింది. మొబైల్, డెస్క్‌టాప్ వర్షన్లోనూ వినియోగదారులు ట్విటర్‌ను యాక్సెస్ చేయలేకపోయారు. కంపెనీ ట్వీట్‌డెక్ యాప్‌కూడా డౌన్ అయ్యిందని పలువురు వినియోగదారులు నివేదించారు. చాలా ఏళ్ల తర్వాత డెస్క్‌టాప్, మొబైల్ యాప్‌లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 45 నిమిషాల పాటు ట్విటర్ వినియోగదారులకు అందుబాటులో లేకుండా పోయింది.
డౌన్‌డిటెక్టర్ ప్రకారం.. ట్విటర్ సేవలు 45 నిమిషాలపాటు నిలిచిపోయాయి. యూకే, యూఎస్, యూరప్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా మైక్రోబ్లాగింగ్ సైట్ పనిచేయలేదు. ట్విటర్ యూజర్లకు ‘ట్వీట్లు ప్రస్తుతం లోడ్ కావడం లేదు. మళ్లీ ప్రయత్నించండి’ అనే మెసేజ్ వచ్చింది. కొంతమంది యూజర్లకు ‘ఓవర్ కెపాసిటీ’ అనే ఎర్రర్ మెసేజ్ రాగా, మరికొంతమందికి ‘పేజీ డౌన్లో ఉంది’ అని చూయించింది. యూఎస్‌లో 27,000 కంటే ఎక్కువ మంది ట్విటర్‌ను యాక్సెస్ చేయలేకపోపోయారు. యూకే, మెక్సికో, బ్రెజిల్, ఇటలీతో సహా ఇతర దేశాల్లోని అనేక మంది వినియోగదారులు ట్విటర్ పనిచేయడం లేదని నివేదించారు. భారతదేశంలో మాత్రం ట్విటర్ సేవలు సాధారణంగానే పనిచేశాయి.