ఇజ్రాయెల్‌పై దాడి చేస్తాం.. తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్ హెచ్చరిక
తుర్కియే, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తామంటూ అధ్యక్షుడు ఎర్డోగాన్ తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కండ్లు ద్వేషంతో మూసుకుపోయాయని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 12 : తుర్కియే, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తామంటూ అధ్యక్షుడు ఎర్డోగాన్ తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కండ్లు ద్వేషంతో మూసుకుపోయాయని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, ‘అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధంలో పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించకపోయి ఉంటే, ఇజ్రాయెల్‌కు తగిన విధంగా సమాధానం చెప్పేవాళ్లం’ అని ఆయన అన్నారు.
తాము ఎలాగైతే లిబియా, కరాబాఖ్లలోకి ప్రవేశించామో, అలాగే ఇజ్రాయెల్‌లోకి కూడా అడుగుపెట్టగలమని ఎర్డోగాన్ హెచ్చరించారు. కొద్ది రోజులుగా ఇరు దేశాల నాయకులు తీవ్ర ఆరోపణలతో పరస్పరం మాటల దాడికి దిగుతున్నారు. ఎర్డోగాన్ ప్రభుత్వం కుర్దులపై ఊచకోతకు పాల్పడుతున్నదని నెతన్యాహు ఆరోపించగా, తుర్కియే విదేశాంగ మంత్రి స్పందిస్తూ, నెతన్యాహును ‘నయా హిట్లర్’గా అభివర్ణించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

