వాషింగ్టన్, జనవరి 31: తాను పెరుగుతున్న క్రమంలో జాత్యహంకారానికి గురయ్యానని అమెరికా ఎఫ్బీఐ డైరెక్టర్గా ట్రంప్ ఎంపిక చేసిన కాశ్ పటేల్ అన్నారు. ఎఫ్బీఐ డైరెక్టర్గా కాశ్ను ధ్రువీకరించేందుకు జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘నన్ను అసహ్యమైనవాడినని గేలి చేసేవారు. మీరు నల్లజాతి వాళ్లు.. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్లిపోమని నన్ను దూషించేవారు’ అని కాశ్ తెలిపారు.