వాషింగ్టన్, ఏప్రిల్ 29: ఓడ రేవుల దిగ్బంధాన్ని సాధ్యమైనంత త్వరగా తొలగించాలన్న ఇరాన్ ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. ఇరాన్ రేవుల దిగ్బంధాన్ని మరింత పొడిగించేందుకు సిద్ధంగా ఉండాలని తన క్యాబినెట్ సహచరులకు ట్రంప్ ఆదేశించినట్లు అమెరికా అధికారులను ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది.
శాంతి చర్చలు విఫలమై, హొర్ముజ్ మూసివేత కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్‌పై ఒత్తిడి పెంచేందుకు ఇతర పద్ధతుల కన్నా నౌకా రేవుల దిగ్బంధానికి తాను అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఇటీవల జరిగిన పలు సమావేశాల్లో ట్రంప్ పేర్కొన్నట్లు తెలిసింది. దిగ్బంధం కొనసాగించడంతో పోలిస్తే బాంబులతో దాడి చేయడం లేదా యుద్ధం నుంచి వైదొలగడం వంటి ప్రత్యామ్నాలతో మరింత ప్రమాదమని ట్రంప్ నమ్ముతున్నట్లు పత్రిక తెలిపింది.