Russian oil buyers | రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా టారిఫ్‌ల (tariff) బాంబు పేలుస్తున్నారు. భారత్ సహా ప్రపంచ దేశాలపై సుంకాల మోత మోగిస్తున్నారు. ఇందులో భాగంగానే రష్యాతో వ్యాపారం చేస్తున్న దేశాలపై (Russian oil buyers) భారీగా సుంకాలు విధిస్తానని హెచ్చరించిన విషయం తెలిసిందే. మాస్కోతో చమురు వాణిజ్యం చేస్తే భారత్ సహా ఆయా దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తానంటూ గత కొంతకాలంగా తీవ్రంగా హెచ్చరిస్తూ వస్తున్నారు. అయితే, దీనిపై ట్రంప్ తాజాగా మాట మార్చారు.
అదనపు టారిఫ్‌లపై అలాంటి శాతాలేవీ తాను చెప్పలేదని వెల్లడించారు. వైట్‌హౌస్‌లో మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. అదనపు టారిఫ్‌లపై తానెప్పుడు శాతాల గురించి చెప్పలేదన్నారు. దానిపై కసరత్తు చేస్తున్నామని, ఏం జరుగుతుందో చూడాలని వ్యాఖ్యానించారు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. బుధవారం రష్యాతో సమావేశం ఉందని.. అందులో ఏం జరుగుతుందో చూడాలని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ట్రంప్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
24 గంటల్లో అదనపు సుంకాలు..
రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన అక్కసును వెళ్లగక్కారు. 24 గంటల్లోగా భారత్‌పై అదనపు సుంకాలు విధించనున్నట్లు ట్రంప్ మంగళవారం హెచ్చరించారు. భారత్ మంచి వాణిజ్య భాగస్వామి కాదు. ఎందుకంటే వారు (భారత్) మాతో వ్యాపారం చేస్తున్నారే కాని మేము వారితో వ్యాపారం చేయడం లేదు. అందుకే 25 శాతం సుంకాలు విధించాలని నిర్ణయించాం. అయితే రానున్న 24 గంటల్లోగా దీన్ని గణనీయంగా పెంచదలచుకున్నాను. ఎందుకంటే వారు రష్యన్ చమురు కొంటున్నారు. యుద్ధానికి ఆజ్యం పోస్తున్నారు అని మంగళవారం సీఎన్బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ వ్యాఖ్యానించారు.
Also Read..
Ajit Doval | ట్రంప్ సుంకాల బెదిరింపు వేళ.. రష్యా పర్యటనకు అజిత్ దోవల్
Donald Trump | 24 గంటల్లో అదనపు సుంకాలు.. భారత్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
Nikki Haley | భారత్‌తో సంబంధాలను తెంచుకోకండి.. అమెరికాకు నిక్కీ హేలీ కీలక సూచన