వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన డొనాల్డ్ ట్రంప్ మాజీ డెమొక్రటిక్ రిప్రజెంటేటివ్ తులసి గబ్బర్డ్‌ను అత్యంత కీలక పదవికి ఎంపిక చేశారు. దేశ ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ నాయకత్వంలో భారీ మార్పులకు శ్రీకారం చుడుతూ ఆమెను డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ (డీఎన్ఐ) పదవికి ఎంపిక చేశారు. ఈ పదవీ బాధ్యతల్లో భాగంగా ఆమె సీఐఏ, ఎన్ఎస్ఏ సహా 18 ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను పర్యవేక్షించనున్నారు. తనను ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా నియమించినందుకు ట్రంప్‌నకు తులసి ధన్యవాదాలు చెప్పారు. తులసి గబ్బర్డ్ డెమొక్రటిక్ పార్టీ తరపున దేశాధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారనే వార్తలు గతంలో వచ్చాయి. అయితే ఆమె 2022లో ఆ పార్టీని వదిలిపెట్టి, ట్రంప్‌నకు మద్దతు పలికారు.