న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబం మొబైల్ ఫోన్ల రంగంలోకి అడుగు పెట్టింది. ‘ది ట్రంప్ ఆర్గనైజేషన్’ నిర్వాహకుల్లో ఒకరైన ఎరిక్ ట్రంప్ తెలిపిన వివరాల ప్రకారం, అమెరికాలో మొబైల్ ఫోన్ సర్వీస్‌కు ట్రంప్ పేరును వాడుకోవడానికి లైసెన్స్ ఇచ్చారు. ట్రంప్ మొబైల్ పేరుతో ఏర్పాటు చేసిన వెంచర్ ద్వారా అమెరికాలో ఫోన్లను విక్రయిస్తారు. బంగారు రంగులోని టీ1 మొబైల్ ఆగస్టు నుంచి ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. దీనిని వేరొక కంపెనీ డిజైన్ చేసి, తయారు చేస్తుంది. ఈ వెంచర్ ద్వారా ఓ కాల్ సెంటర్‌ను కూడా నిర్వహిస్తారు. ఈ ఫోన్, సర్వీస్‌లను టీ1 మొబైల్ అని పిలుస్తారు. అమెరికాలో అమ్ముకునే ఫోన్లను భారత్‌లో తయారు చేయాలని యాపిల్ నిర్ణయించడాన్ని ట్రంప్ తప్పుబట్టారు.