న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధంతో అమెరికా వంటి సంపన్న దేశాలు లాభపడుతున్నాయని, అందుకు పెరుగుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆస్తులే సాక్ష్యమని పశ్చిమాసియా రక్షణ రంగ నిపుణుడు వాయెల్ అవ్వాద్ సోమవారం వెల్లడించారు. కుబేరులైన తన సహచరులను సంతృప్తి పరచడానికి, ఇజ్రాయెల్ అజెండాను నెరవేర్చడానికి ఇరాన్ యుద్ధాన్ని ట్రంప్ పొడిగిస్తున్నారని అవ్వాద్ చెప్పారు.
యుద్ధాల్లో సంపన్న దేశాలు మరింత సంపన్నమవుతాయని, పేద దేశాలు మరింత పేదవవుతాయని అన్నారు. అమెరికాసహా చాలా దేశాల్లో ప్రజలు యుద్ధం పట్ల అసంతృప్తిగా ఉన్నారని..అయినా ట్రంప్ ఎందుకు ఈ యుద్ధం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారని అవ్వాద్ ప్రశ్నించారు.