Trump – Putin : భారత్‌పై సుంకాల బాదుడుకు తెరతీసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఉక్రెయిన్ యుద్ధంపై మరోసారి దృష్టి సారించారు. సంధి కుదిర్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న ట్రంప్.. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin)ను కలుస్తాను అని ప్రకటించారు.
ఆగస్టు 15న అలస్కాలో పుతిన్‌తో భేటి అయి పలు విషయాలపై చర్చిస్తానని ట్రంప్ తెలిపారు. దాంతో, ఇరువురి మధ్య జరుగబోయే సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ట్రంప్, పుతిన్‌ల భేటీని భారత్ స్వాగతించింది. అని ట్రంప్ ప్రకటించారు. ఈ సమావేశం తర్వాత ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడంపై స్పష్టత రానుందని ఇండియా భావిస్తోంది.
Following Trump’s meeting with Putin, two things will be achieved:
1) Nothing.
2) Trump won’t be able to sit for a while. pic.twitter.com/GZMNXVsPJr
— 💙🌊 Zero Dark Twenty-Nine 🌊🌊🖋️🧫 (@herotimeszero) August 8, 2025
అమెరికా, రష్యాల మధ్య అవగాహన కుదిరినందుకు సంతోషిస్తున్నాం. ఇరుదేశాధినేతలు ఆగస్టు 15న అలస్కాలో భేటి కావడాన్ని స్వాగతిస్తున్నాం. ఈ సమావేశంతో నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పడనుందని ఆశిస్తున్నాం. రష్యా, ఉక్రెయిన్ శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ పలు సందర్భాల్లో ప్రస్తావించారు. అని శనివారం భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ట్రంప్, పుతిన్ భేటి అనంతరం రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య భూభాగాల తరలింపు ఉండే అవకాశముందని సమాచారం.