Tik Tok Shutdown | ప్రముఖ సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్ నిషేధం గడువును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పొడిగించారు. ఫెడరల్ నిబంధనలను పట్టించుకోకుండా టిక్‌టాక్‌ను మూసివేసే గడువును ట్రంప్ పొడిగింపు ఉత్తర్వులు ఇవ్వడం ఇది నాలుగోసారి. ఈ మేరకు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. టిక్‌టాక్‌పై నిషేధం ఎత్తివేసేందుకు చైనాతో ఒక ఫ్రేమ్‌వర్క్ ఒప్పందం కుదిరిందని రెండురోజుల కిందట చెప్పి.. నిషేధం పొడగించడం గమనార్హం. ట్రంప్ మంగళవారం మాట్లాడుతూ అమెరికా, చైనా మధ్య టిక్‌టాక్ యాప్ విషయంలో ఒప్పందం కుదిరిందన్నారు. ఈ నిర్ణయం తర్వాత బైట్‌డాన్స్ యాజమాన్యంలోని ఈ యాప్ అమెరికాలో వాడుకలోకి వస్తుందన్నారు. టిక్‌టాక్‌ను కొనుగోలు చేసేందుకు చాలా కంపెనీల గ్రూప్ యూఎస్ వద్ద ఉందన్నారు.
సీఎన్‌బీసీ నివేదిక ప్రకారం.. ఈ ఒప్పందం రాబోయే 30 నుంచి 45 రోజుల్లో పూర్తవుతుందని భావిస్తున్నారు. ఈ ఒప్పందం చైనా నియంత్రణలో నున్న కాంగ్రెస్ నుంచి ఆమోదం కూడా అవసరమయ్యే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం.. మైక్రోసాఫ్ట్, అమెజాన్, బిలియనీర్ ఫ్రాంక్ మెక్‌కోర్ట్, ఓన్లీఫాన్స్ వ్యవస్థాపకుడు నేతృత్వంలోని కన్సార్టియం బిడ్డర్స్ జాబితాలో ఉన్నాయి. 2024లో బైడెన్ పరిపాలన సమయంలో టిక్‌టాక్ డేటా భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది అధికారంలోకి వచ్చిన ట్రంప్ టిక్‌టాక్ నిషేధానికి సంబంధించిన ఇప్పటి వరకు నాలుగుసార్లు పొడిగించారు. అధ్యక్షుడైన తర్వాత తొలిసారిగా జనవరి 20న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. టిక్‌టాక్‌ను అమెరికన్ కంపెనీగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే ఏప్రిల్‌లో రెండోసారి గడువును పొడిగించారు. కానీ, ట్రంప్ టారిఫ్ ప్రకటన తర్వాత చైనా వెనక్కి తగ్గడంతో ఒప్పందం జరుగలేదు. మూడోసారి జూన్‌లో ట్రంప్ గడువును 90 రోజులు పొడిగించారు.
వాస్తవానికి టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డాన్స్. ఇది చైనాకు చెందిన కంపెనీ. ఈ యాప్ యూజర్ల డేటాను చైనా ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉంటుందని అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తుంది. దాంతో జాతీయ భద్రతకు ముప్పుగా పేర్కొంటున్నది. అయితే, టిక్‌టాక్‌ను అమెరికన్ కంపెనీ అప్పగించాలని బైట్‌డాన్స్‌ను ఆదేశించింది. దేశంలో దిన కార్యకలాపాలు నిలిపివేయాలనే చట్టాన్ని అమెరికా ఆమోదించింది. ఎఫ్‌బీఐ, ఫెడరల్ కమ్యూనికేషన్ రెండు బైట్‌డాన్స్ బ్రౌజింగ్ హిస్టరీ, లొకేషన్, బయోమెట్రిక్ సమాచారం వంటి యూజర్ల డేటాను చైనా అధికార ప్రభుత్వంతో పంచుకోవచ్చని హెచ్చరించాయి. టిక్‌టాక్ ఎప్పుడూ అలా చేయలేదని, అలా చేసే ఉద్దేశం లేదని చెప్పింది బైట్‌డాన్స్ స్పష్టం చేసింది. అమెరికా ప్రభుత్వం ఇలా జరిగిందనేదానికి ఆధారాలు అందించలేదని టిక్‌టాక్ తెలిపింది.