తాలిసే: ఫిలిప్పీన్స్లో ఉష్ణ మండల తుఫాను ట్రామీ బీభత్సం సృష్టించింది. దీని కారణంగా భారీ వరదలు రావడమే కాక, పలు చోట్ల కొండ చరియలు విరిగిపడటంతో 115 మందికి మరణించగా, వందలాది మంది గల్లంతయ్యారు.
పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన బాధితులను రక్షించేందుకు విపత్తుల నివారణ బృందాలు ప్రయత్నిస్తున్నట్టు అధ్యక్షుడు మార్కోస్ శనివారం తెలిపారు. ఫిలిప్పీన్స్ వాయువ్య ప్రాంతాన్ని శుక్రవారం ట్రామీ బలంగా తాకడంతో 81 మంది మరణించగా, 34 మంది గల్లంతయ్యారు. మనీలా ఆగ్నేయ ప్రాంతంలో తుఫాన్, భారీ వర్షాలకు పలువురు మరణించారు.