డర్బన్: దక్షిణాఫ్రికాలోని జూలూ ప్రాంతానికి చెందిన ప్రముఖ నేత మంగసూతు బుతేలేజి(Mangosuthu Buthelezi) కన్నుమూశారు. ఆయన వయసు 95 ఏళ్లు. సాంప్రదాయ జూలూ ప్రాంతానికి ఆయన ప్రైమ్మినిస్టర్గా చేశారు. గడిచిన 50 ఏళ్ల నుంచి దక్షిణాఫ్రికా రాజకీయాల్లో మంగసూతు కీలక పాత్ర పోషించారు. జూలూ తెగ ప్రజల కోసం ఆయన తీవ్రంగా పోరాడారు. మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా క్యాబినెట్లో ఆయన పదేళ్ల పాటు మంత్రిగా చేశారు. జూలూ చీఫ్ బుతేలేజి మృతి పట్లు దేశాధ్యక్షుడు సిరిల్ రామఫోసా నివాళి అర్పించారు. దేశ చరిత్రలో ఆయన కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు.
దక్షిణఫ్రికాలో అత్యధికంగా ఉన్న స్థానిక తెగల్లో జూలూ అత్యంత కీలక వర్గం. ఆ గ్రూపునకు చెందిన రాజవంశీకుల కుటుంబంలో బుతేలేజీ పుట్టారు. జూలూ చక్రవర్తి సోదరి అయిన ప్రిన్సెస్ మగోగో కాడింజులుకు బుతేలేజి జన్మించారు. 1964లో రిలీజైన ఓ చిత్రంలో తన ముత్తాత జూలూ కింగ్ చెస్ట్వాయో పాత్రను ఆయన పోషించారు.
క్వాజులుకు ప్రైమ్మినిస్టర్గా ఆయన చేశారు. 1975లో ఇన్కతా ఫ్రీడం పార్టీని ఆయన స్థాపించారు. 2019లో ఆయన పార్టీకి బ్రేకప్ చెప్పారు. దాదాపు 44 ఏళ్ల పాటు ఆయన పార్టీ చీఫ్గా చేశారు. 1980 దశకంలో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పాటను బుతేలేజి తీవ్రంగా విమర్శించారు.