టోక్యో, ఏప్రిల్ 23: జపాన్ ఉత్తర తీరప్రాంతంలో ఓ పర్యాటకుల పడవ మునిగిపోయింది. అందులో ఉన్న 26 మంది గల్లంతయ్యారు. దాదాపు 7 గంటలపాటు గాలింపు చేపట్టినా ఒక్కరి అచూకీ కూడా లభించలేదు. వీరంతా మరణించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. అలలు భారీగా ఎగిసిపడటంతోనే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని తెలిపారు.