Rishi Sunak | బ్రిటన్ ప్రధానిగా నియమితులు కావడంతో భారత సంతతికి చెందిన తొలి నేతగా రిషి సునాక్మంగళవారం రికార్డు నెలకొల్పారు. సోమవారం పెన్నీ మోర్డాంట్ పోటీ నుంచి వైదొలగడంతో రిషి సునాక్ ఏకగ్రీవంగా ప్రధానిగా ఎన్నికయ్యారు. తొలి ప్రయత్నంలో లిజ్ ట్రస్ చేతిలో ఓటమి పాలైనా.. మలి ప్రయత్నంలోనే ఒకనాటి రవి అస్తమించని సామ్రాజ్యానికి సారధ్యం వహించిన బ్రిటన్ ప్రధానిగా నియమితులయ్యారు. బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ఎన్నిక ప్రక్రియపై ఓ లుక్కేద్దాం.. !