ఈ ముగ్గురు.. చిన్నారులు కాదు..చిచ్చర పిడుగులు..స్కేట్ బోర్డుపై కళ్లు చెదిరే విన్యాసాలు చేసి అందరినీ అబ్చురపరిచారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ముగ్గురు చిన్నారుల విన్యాసాల వీడియో ఫేమస్ కార్టూన్ సిరీస్ పవర్పఫ్ గర్ల్స్ను గుర్తుకు తెచ్చింది.
ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్ రీల్స్‌లో ‘పైగీటోబిన్’ అనే పేజీ అప్లోడ్ చేసింది. ఈ వీడియోలో ఆస్ట్రేలియాకు చెందిన ఏడేళ్ల బాలిక పైజ్ టోబిన్ స్కేట్ పార్క్‌లో తన ఇద్దరు స్నేహితులతో కలిసి స్కేట్బోర్డింగ్ చేస్తోంది. అమ్మాయిలు ఒకరి తర్వాత ఒకరు ఖచ్చితమైన టైమింగ్‌తో రింక్‌లోకి వెళ్లడం చూడొచ్చు. వారు ఒకరినొకరు వరుసలో అనుసరిస్తూ, అదే సమన్వయంతో తిరిగి రావడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఈ వీడియోకు 12 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. మిలియన్ మంది లైక్ చేశారు.