మాస్కో: రష్యాలోని ఏంజిల్స్ బాంబర్ బేస్‌పై ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయినట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. వైమానిక రక్షణ వ్యవస్థ ఆ డ్రోన్‌ను కూల్చివేసిందని, కానీ ఆ డ్రోన్ శిథిలాలు కిందపడడం వల్ల ముగ్గురు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. స్ట్రాటజిక్ బాంబర్ విమానాల బేస్‌గా ఏంజిల్స్ విమానాశ్రయం పనిచేస్తున్నది. బోర్డర్‌కు 500కిలోమీటర్ల దూరంలో ఆ బేస్ ఉన్నది. లో ఆల్టిట్యూడ్‌లో వెళ్తున్న ఉక్రెయిన్ డ్రోన్‌ను కూల్చివేసినట్లు రష్యా రక్షణ శాఖ పేర్కొన్నది. సరటోవ్ ప్రాంతంలో ఆ బేస్ ఉంది. డ్రోన్ దాడి వల్ల ప్రజలకు ఎటువంటి ప్రమాదం లేదని గవర్నర్ తెలిపారు.