Prison Break | జైలు సీలింగ్‌కు కన్నం వేసి.. పారిపోయిన ముగ్గురు క్రిమినల్స్
డ్రగ్స్, ఆయుధాల కేసుల్లో అరెస్టయి జైల్లో ఉన్న ఇద్దరు ఖైదీలు.. దొంగతనం కేసులో జైలుకొచ్చిన మరో ఖైదీతో కలిసి పరారయ్యారు. ఇది జరిగింది కూడా అగ్రరాజ్యం అమెరికాలో కావడం గమనార్హం. మిసోరీలోని జైల్లో బ్లెవిన్స్, స్టీఫెన్స్, క్రాఫోర్డ్ అనే ముగ్గురు ఖైదీలు ఉన్నారు. వీళ్లు ముగ్గురూ కూడా తమ సెల్ సీలింగ్‌కు పెద్ద కన్నాలు చేసి అక్కడి నుంచి పారిపోయారు.
ఆ రంధ్రాల నుంచి ఒక మెయింటెనెన్స్ డోర్‌కు చేరుకున్న ముగ్గురూ.. అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వాళ్లకు జైలు అధికారుల్లో ఎవరైనా సహాయం చేసినట్లు ఎలాంటి ఆధారాలూ లేవని పోలీసులు అంటున్నారు. అసలు ముగ్గురు ఖైదీలు తప్పించుకొని ఎంత సమయం గడిచిందో కూడా ఎవరికీ తెలియదని సమాచారం.

ఈ ఖైదీల వద్ద ఆయుధాలు ఉన్నాయని, కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. త్వరలోనే ముగ్గుర్నీ అదుపులోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

