టొరంటో, సెప్టెంబర్ 26: అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడన్న ఆరోపణలపై కెనడాలో అరెస్టయిన ఖలిస్థాన్ తీవ్రవాది ఇంద్రజిత్ సింగ్ గోసల్కు వారం లోపే బెయిల్ మంజూరైంది. ఆయనతో ఉన్న నిషేధిత సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ కోఆర్డినేటర్ గురుపత్వంత్ సింగ్ పన్నూ భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్పై నోరు పారేసుకున్నాడు.
దమ్ముంటే తన ను అరెస్ట్ చేయడానికి లేదా భారత్కు అప్పగించడానికి ప్రయత్నించమని సవాల్ విసిరారు. ‘అజిత్ దోవల్ నీవు కెనడాకో, అమెరికాకో, ఇతర ఐరోపా దేశాలకో వచ్చి నన్ను అరెస్ట్ చేయడానికో, అప్పగింతకో ఎందుకు ప్రయత్నించవు. నీ కోసం ఎదురు చూస్తున్నా’ అని పేర్కొన్నాడు.