సిడ్నీ, డిసెంబర్ 15: ‘ఆదిత్య 369’ సినిమా చూశారా? మనసులో అనుకొన్న విషయాలు స్పీకర్లలో వినిపించడం గమ్మత్తుగా అనిపించింది కదూ. ఇప్పుడు దాదాపుగా అలాంటి పరికరాన్నే ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, సిడ్నీ పరిశోధకులు తయారు చేశారు. మనసులోని ఆలోచనలను అక్షరీకరించే హెల్మెట్ లాంటి డివైజ్ను (మైండ్ రీడింగ్ హెల్మెట్) వీళ్లు అభివృద్ధి చేశారు.
ఎలక్ట్రోఎన్సఫలోగ్రామ్ (ఈఈజీ) సాంకేతికతతో ఈ డివైజ్ పని చేస్తుందన్నారు. పక్షవాతం, వివిధ ప్రమాదాల్లో గాయపడి మాట్లాడలేని వారు ఈ పరికరం సాయంతో తమ భావాలను ఇతరులకు సులభంగా వ్యక్తపరుచవచ్చని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేశారు.