హెచ్ 1బీ ఫీజుల సవరణకు వైట్‌హౌస్ ఆమోదం
అమెరికాలో విదేశీ నిపుణులకు ఇచ్చే హెచ్1బీ వీసా పిటిషన్ ఫీజులను సవరించేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తెచ్చిన ప్రతిపాదనపై వైట్‌హౌస్ సమీక్ష పూర్తి చేసుకున్నది. రాబోయే కొద్ది వారాల్లో దీనికి సంబంధించిన పూర్తి ముసాయిదాను ప్రభుత్వం ప్రజల పరిశీలనకు ఉంచనున్నది.
- భారతీయ టెకీలపై ప్రభావం ఎంత?
వాషింగ్టన్: అమెరికాలో విదేశీ నిపుణులకు ఇచ్చే హెచ్1బీ వీసా పిటిషన్ ఫీజులను సవరించేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తెచ్చిన ప్రతిపాదనపై వైట్‌హౌస్ సమీక్ష పూర్తి చేసుకున్నది. రాబోయే కొద్ది వారాల్లో దీనికి సంబంధించిన పూర్తి ముసాయిదాను ప్రభుత్వం ప్రజల పరిశీలనకు ఉంచనున్నది. ముందుగా ప్రభుత్వం ఈ ప్రతిపాదనను అధికారికంగా ప్రచురించి, సాధారణ ప్రజలు, సంస్థల నుంచి సలహాలు, అభిప్రాయాలు స్వీకరిస్తుంది. ఈ పరిణామం భారతీయ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికా ఇచ్చే హెచ్1బీ వీసాలు, ఉద్యోగ పొడిగింపుల్లో భారతీయులదే సింహభాగం.
అధికారిక గణాంకాల ప్రకారం 2025 ఆర్థిక సంవత్సరంలో పొడిగించిన మొత్తం హెచ్ 1బీ ఉద్యోగాల్లో దాదాపు 78 శాతం భారతీయులకే దక్కాయి. అందువల్ల వీసా పిటిషన్ ఫీజులను పెంచితే, భారతీయ ఐటీ ఉద్యోగులను నియమించుకునే సంస్థలకు దరఖాస్తు ఖర్చులు భారీగా పెరుగుతాయి. ప్రస్తుతానికి పాత ఫీజులే కొనసాగుతున్నప్పటికీ భవిష్యత్తులో అమెరికా కంపెనీలు విదేశీ నిపుణులకు నియమించుకోవడం మరింత ఖరీదైన వ్యవహారంగా మారే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
75 దేశాల వీసా నిషేధాన్ని కొట్టివేసిన అమెరికా కోర్టు
75 దేశాల దరఖాస్తుదారులకు ఇమ్మిగ్రెంట్ వీసాల జారీని నిలిపివేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం ప్రవేశపెట్టిన విధానాన్ని యునైటెడ్ స్టేట్స్ న్యాయమూర్తి కొట్టివేశారు. ఈ విధానం విదేశాంగ మంత్రి మార్కో రూబియోకున్న చట్టబద్ధమైన అధికార పరిధినిమించిపోయిందని పేర్కొన్నారు. న్యూయార్క్ సదరన్ డిస్ట్రిక్ట్‌లోని మాన్హాటన్ న్యాయమూర్తి జానెట్ వర్గాస్ శుక్రవారం ఇచ్చిన తన తీర్పులో ఈ విధానం చట్ట విరుద్ధం అని, అలాగే కాన్సులర్ అధికారుల ఇమ్మిగ్రేషన్ వీసా నిర్ణయాలపై విదేశాంగ మంత్రికున్న అధికారాన్ని స్పష్టంగా తొలగించిన సమాఖ్య ఇమ్మిగ్రేషన్ చట్టానికి విరుద్ధంగా ఉందని అన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

