హొర్ముజ్‌పై దిగ్బంధం ఎత్తివేత!.. అమెరికా అధ్యక్షుడు సంకేతాలు
పశ్చిమాసియా సంక్షోభానికి తెరపడేలా, మరొక శాంతి ఒప్పందం కుదుర్చుకోడానికి అమెరికా-ఇరాన్ అడుగులు వేస్తున్నాయి. హొర్ముజ్ జలసంధిపై దిగ్బంధం ముగిసిందని తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.
- తుది ఒప్పందంపై త్వరలోనే ప్రకటన
- ట్రంప్ ప్రకటనను ఖండించిన ఇరాన్
వాషింగ్టన్, మే 29: పశ్చిమాసియా సంక్షోభానికి తెరపడేలా, మరొక శాంతి ఒప్పందం కుదుర్చుకోడానికి అమెరికా-ఇరాన్ అడుగులు వేస్తున్నాయి. హొర్ముజ్ జలసంధిపై దిగ్బంధం ముగిసిందని తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్‌తో కుదరనున్న ఒప్పందంలో భాగంగా హొర్ముజ్ జలసంధిలో నావికా దిగ్బంధాన్ని ఎత్తివేస్తామని ఆయన శుక్రవారం తెలిపారు. ఇరాన్‌తో చర్చల భవిష్యత్‌ను నిర్ణయించడానికి తాను వైట్‌హౌస్ సిట్యుయేషన్ రూమ్‌కు వెళ్తున్నట్టు ట్రంప్ ట్రూత్ సోషల్‌లో ప్రకటించారు. ఒప్పందానికి ప్రాతిపదికగా నిలిచే కీలక షరతుల గురించి ఆయన వివరించారు.
అణ్వాయుధం, అణు బాంబు ఎన్నడూ అభివృద్ధి చేయమని ఇరాన్ హామీఇవ్వాలి. హొర్ముజ్ జలసంధిని ఎలాంటి సుంకాలు లేకుండా, షరతులు విధించకుండా తెరవాలని అన్నారు. ఈ ప్రాంతంలో విధించిన నౌకా దిగ్బంధనాలు ఎత్తివేస్తామని, హొర్ముజ్‌లో చిక్కుకుపోయిన నౌకలు తమ గమ్య స్థానాలకు వెళ్లడం ప్రారంభించవచ్చునని అన్నారు. గత ఏడాది ఇరాన్ అణు కేంద్రాలపై జరిగిన దాడులలో లక్ష్యంగా చేసుకున్న ప్రదేశాల కింద పాతిపెట్టి ఉన్న శుద్ధి చేసిన అణు పదార్థాన్ని నాశనం చేయడానికి ముందు ఇరాన్, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ సమన్వయంలో అమెరికా దానిని వెలికి తీస్తుందని ఆయన పేర్కొన్నారు.
హొర్ముజ్‌పై నియంత్రణ మాదే: ఇరాన్
ట్రంప్ ప్రకటన చేసిన కొద్ది నిమిషాలకే ఇరాన్ స్పందించింది. యూఎస్ నావికా దిగ్బంధనం ఎత్తివేసిన తర్వాతే హొర్ముజ్‌ను తిరిగి తెరుస్తామని, అదీ కూడా తమ షరతులు, పర్యవేక్షణతోనే కొనసాగుతుందని స్పష్టం చేసింది.
అమెరికా యుద్ధ విమానాన్ని కూల్చేశాం
యూఎస్‌కు చెందిన యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్టు ఇరాన్ ప్రకటించింది. బుషెర్ ప్రావిన్స్‌లో జామ్ గవర్నరేట్‌లో దానిని కూల్చివేసినట్టు తెలిపింది. అయితే దీనిని అమెరికా ఖండించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

