63 ఏండ్ల క్రితం పోగొట్టుకున్న ఉంగరం దొరికింది..!
Over 63 years old ring: ఏదైనా పాతకాలం నాటి అరుదైన వస్తువు దొరికితే మనం ఏం చేస్తాం? దాన్ని భద్రంగా దాచిపెట్టుకుని మురిసిపోతాం. కానీ అమెరికాకు చెందిన ఓ యువతి మాత్రం అలా చేయలేదు.

వాషింగ్టన్: ఏదైనా పాతకాలం నాటి అరుదైన వస్తువు దొరికితే మనం ఏం చేస్తాం? దాన్ని భద్రంగా దాచిపెట్టుకుని మురిసిపోతాం. కానీ అమెరికాకు చెందిన ఓ యువతి మాత్రం అలా చేయలేదు. తనకు దొరికిన ఓ బంగారు ఉంగరాన్ని.. దాన్ని పోగొట్టుకున్న వ్యక్తికి చేర్చేవరకు విశ్రమించలేదు. అందుకోసం ఏకంగా డిటెక్టివ్ అవతారమెత్తి చివరకు అనుకున్నది సాధించింది.
వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని బ్రోక్పోర్ట్కు చెందిన మేరీ జో ఓర్జెక్కు లాక్కవన్నా నగరంలో తన పూర్వీకులకు చెందిన ఇల్లు ఉంది. గతేడాది ఆ ఇంటిని సర్దుతుండగా ఓర్జెక్కు ఓ అరుదైన ఉంగరం దొరికింది. నీలి వర్ణం రాయి పొదిగిన బంగారు ఉంగరం అది. అయితే అది తన పూర్వీకులది కాదని నిర్ధారించుకున్న ఓర్జెక్.. అది ఎవరిదో తెలుసుకుని వారి వద్దకు చేర్చాలని నిర్ణయించుకుంది.
ఆ మేరకు ఉంగరం గురించి ఆరా తీస్తూ లాక్కవన్నాలో తన తండ్రి చదివిన పాఠశాలకు వెళ్లింది. అక్కడ ఉన్న లైబ్రేరియన్ను సంప్రదించగా.. ఉంగరంపై ఉన్న ‘ఈఎల్డీ’ అనే అక్షరాల ఆధారంగా అది ఆ పాఠశాలలో చదివిన 1955 బ్యాచ్ విద్యార్థికి చెందినదిగా గుర్తించారు. అయితే ఆరు దశాబ్దాల క్రితం నాటి రిజిస్టర్ వారికి అక్కడ లభించలేదు.
దాంతో ఓర్జెక్ ఆ పాఠశాల మాజీ లైబ్రేరియన్ సుసాన్ పలుంబోని సంప్రదించింది. తన వద్ద ఉన్న వివరాలను ఆయనకు వివరించింది. ఆ మాజీ లైబ్రేరియన్ 1955 నాటి రిజిస్టర్ను వెలికితీసి అది యూజీన్ డార్మ్స్టెడ్టర్ అనే వ్యక్తిదిగా తెలిపారు. దాంతో యూజీన్ ఆచూకీ తెలుసుకునేందుకు ఓర్జెక్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆయన లాక్కవన్నాలోనే ఉంటున్నారని, అగ్నిమాపక శాఖలో విధులు నిర్వహించి రిటైర్ అయ్యారని తెలుసుకుంది.
ఆ తర్వాత యూజీన్ వద్దకు వెళ్లిన ఓర్జెక్ ఆ ఉంగరాన్ని ఆయనకు చూపించింది. దాన్ని చూసిన 80 ఏండ్ల యూజీన్ డార్మ్స్టెడ్టర్ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఆ ఉంగరాన్ని తాను 1958లో పోగొట్టుకున్నానని, ఎంత వెతికినా అది దొరకలేదని చెప్పారు. ఆరు దశాబ్దాల క్రితం పోగొట్టుకున్న ఆ ఉంగరాన్ని తిరిగి తీసుకొచ్చి తనకు ఇచ్చిన ఓర్జెక్ను మనస్ఫూర్తిగా అభినందించారు. ప్రస్తుతం ఈ కథనం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నది. ఓర్జెక్ను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Gold ring
- Old ring
- USA
- Washington
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

