వాషింగ్టన్ : అంతర్జాతీయ ఎఫ్-1 స్టూడెంట్స్కు అమెరికాలో ఉద్యోగావకాశాలను కల్పిస్తున్న ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ప్రోగ్రామ్ను నిలిపేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదంటే దీనిలో సవరణలు జరగవచ్చునని తెలుస్తున్నది.
డిపార్ట్మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ నూతన ఓపీటీ రూల్ ను ప్రతిపాదించింది. అంతర్జాతీయ వి ద్యార్థుల కారణంగా అమెరికన్ వర్కర్లకు నష్టం జరగకుండా రక్షణ చర్యలు చేపట్టాలని ప్రతిపాదించింది.