వాషింగ్టన్: అమెరికాలో వర్క్ ఎక్స్‌పీరియెన్స్ సంపాదించడానికి విదేశీ విద్యార్థులకు ఉపయోగపడుతున్న ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ప్రోగ్రామ్‌కు ముప్పు పొంచి ఉంది. ఈ విధానంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న జోసఫ్ ఎడ్లో అమెరికా పౌరసత్వం, వలసదారుల సేవలు (యూఎస్సీఐఎస్)కు డైరెక్టర్ కాబోతున్నారు. ఆయన నామినేషన్‌ను అమెరికా సెనేట్ ధ్రువీకరించింది.
యూఎస్సీఐఎస్ డైరెక్టర్‌గా ఎడ్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న ఇమిగ్రేషన్ ఎజెండాను మరింత వేగంగా అమలు చేయబోతున్నారు. ఎడ్లో తన నామినేషన్ హియరింగ్‌లో మాట్లాడుతూ, కళాశాలలో చదువుకునే సమయానికి మించి ఎఫ్-1 స్టూడెంట్స్‌కు ఓపీటీ ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్స్ను ఇవ్వడాన్ని యూఎస్సీఐఎస్ తొలగించాలన్నారు. అయితే, ఓపీటీ వర్క్ ఆథరైజేషన్‌కు చట్టం అనుమతించదు. ఆ విద్యార్థి కళాశాలలో లేదా పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌లో ఎన్రోల్ అయినప్పటికీ ఇదే నిబంధన వర్తిస్తుంది.