గురువారం 21 జనవరి 2021
International - Nov 25, 2020 , 14:01:36

ప్రపంచంలోనే ఖరీదైన సబ్బు... ధర రూ.2.07 లక్షలు...!!!

  ప్రపంచంలోనే ఖరీదైన సబ్బు... ధర రూ.2.07 లక్షలు...!!!

లెబనాన్:ప్రపంచంలో ఖరీదైన వస్తువులకు ఆదరణ ఉండడానికి ఎన్నోకారణాలుంటాయి. వాటి  ప్రత్యేకతలే ఆయా వస్తువుల విలువను పెంచుతాయి. ఈ సబ్బు కూడా సరిగ్గా అదే కోవకు చెందిందే...ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సబ్బు ఇది. దీని ధర రూ.2.07 లక్షలు. ఈ సబ్బుకు  అంత ధర ఎందుకంటే... ఈ సబ్బు తయారీకి ఉపయోగించిన ఇన్ గ్రీడియంట్స్ ద్వారానే అంట ఖరీదు పలికింది. ఇంతకీ దీని తయారీలో ఏమేం వినియోగించారంటే 17 గ్రాముల బంగారం, వజ్రాల పొడి.  ఈ విషయాన్ని దీనిని తయారుచేసిన సౌదీ అరేబియాకు చెందిన సంస్థ బడేర్‌ హసన్‌ అండ్‌ సన్స్ తెలిపింది. 

ఇవేకాదండోయ్ అలీవ్‌ నూన్, ఆర్గానిక్‌ తేనె, ఖర్జూరం వంటివి వేసి తయారుచేశారు. లెబనాన్‌లోని ట్రిపోలీకి చెందిన ఈ కుటుంబం హ్యాండ్‌ మేడ్‌ సోప్స్, ఖరీదైన సబ్బులు తయారుచేయడంలో ప్రసిద్ధి.. 15వ శతాబ్దం నుంచీ వీళ్లు ఇదే వ్యాపారంలో ఉన్నారు. అయితే ఈ సబ్బు ఇప్పుడెందుకు వార్తల్లోకి వచ్చిందంటే .. దీన్ని ఇటీవల కొందరు ప్రముఖులకు బహుమతిగా ఇచ్చారు. ఇచ్చినప్పుడు వారి పేరును బంగారంతో ఈ సబ్బుపై చెక్కించి మరీ ఇచ్చారట.. ఇది అందరు వాడేలా లేదు కదా! అందుకే ఇది కొంత మందికి మాత్రమే ప్రత్యేకం..ఈ సబ్బును అందరూకొనొచ్చా అన్న దానిపై ఇంకా స్పష్టత మాత్రం ఇవ్వలేదు ఆ సంస్థ.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo