ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాళ్లు ఇరగదీస్తున్నారు. ఆటలోనే కాదు.. హిందీ సినిమా డైలాగ్ రీక్రియేషన్తోనూ అదరగొట్టేస్తున్నారు. హిందీ సినిమాలోని ఓ పాపులర్ డైలాగ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ టీం రీక్రియేట్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
లక్నో సూపర్ జెయింట్స్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ప్లేయర్లు క్వింటన్ డి కాక్, ఆండ్రూ టై, జాసన్ హోల్డర్, ఆండీ బిచెల్ ఒక్కొక్కరుగా వచ్చి హీరోపంతి సినిమాలోని ‘చోటీ బచ్చీ హో క్యా’ డైలాగ్‌ను రీక్రియేట్ చేశారు. ఈ వీడియోను లక్నో ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు. ‘జాసన్ హోల్డర్ అద్భుతమైన నటన’ అని ఒకరు కామెంట్ చేయగా, ‘ఇట్లా డైలాగ్ చెబితే చిన్న పిల్లలేంటి.. పెద్దోళ్లుకూడా బయపడుతారు..’ అని మరొకరు ఫన్నీగా వ్యాఖ్యానించారు. ‘హోల్డర్.. సల్మాన్‌ఖాన్‌లా డైలాగ్ చెప్పాడ’ని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఈ వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది.