Russia Invansion | ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రపై యావత్ ప్రపంచ దేశాలు మండిపడుతున్నాయి. ఏకపక్షంగా సైనిక చర్యకు దిగిన రష్యాపై పలు దేశాలు ఆంక్షల కొరడా విధించాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చర్యను యూరోపియన్ యూనియన్ (ఈయూ)తోపాటు జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, తైవాన్ తదితర దేశాలు ఖండించాయి. అమెరికా, బ్రిటన్ తాజాగా మరికొన్ని ఆంక్షలు ప్రకటించాయి. పేమెంట్స్ కోసం హై సెక్యూరిటీ నెట్వర్క్ గల స్విఫ్ట్ సేవల నుంచి రష్యాను నిషేధించాలని పశ్చిమ దేశాలను ఉక్రెయిన్ కోరింది. దేశాల వారీగా రష్యాపై విధించిన ఆంక్షలు ఇలా..
రష్యా ఆర్థిక, ఇంధన, రవాణా రంగాలను లక్ష్యంగా యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఆంక్షలు ప్రకటించింది.
ఈయూ దేశాల్లోని బ్యాంకుల్లో రష్యన్ల డిపాజిట్లపై ఆంక్షలు.
ఎయిర్‌క్రాఫ్ట్ కాంపొనెంట్స్, ఎక్విప్మెంట్ల సున్నిత టెక్నాలజీ సరఫరాపై ఆంక్షలు.
ఎగుమతుల నియంత్రణ, ట్రేడ్ ఫైనాన్సింగ్‌పై నిషేధం.
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆస్తులు జప్తు
రష్యా ఆర్థిక, మిలిటరీ సంస్థలు లక్ష్యంగా జపాన్ ఆంక్షలు.
జపాన్ బ్యాంకుల్లో రష్యన్ల డిపాజిట్ల స్తంభన.
రష్యన్ ఫెడరేషన్ సెక్యూరిటీ కౌన్సిల్‌లోని ఎనిమిది మంది సభ్యులపై ఆర్థిక ఆంక్షలు. ప్రయాణంపై నిషేధం.
రష్యా మిలిటరీ, భద్రతా బలగాలరు వస్తువుల ఎగుమతిపై నిషేధం.
ఉక్రెయిన్-రష్యా మధ్య దౌత్య చర్చల ద్వారా సమస్య పరిష్కారం అయ్యే వరకు రష్యా అధికారులపై ప్రయాణ నిషేధం.
రష్యాపై ఆర్థిక ఆంక్షలు.. శాంతి చర్చలు సాగే వరకు అమలులో ఆంక్షలు. నిర్దిష్ట ఆంక్షలేమీ ప్రకటించలేదు. ప్రపంచవ్యాప్తంగా సెమీ కండక్టర్లు తయారయ్యేది తైవాన్‌లోనే కావడం గమనార్హం.
రష్యాకు టెక్నాలజీ ఎగుమతిపై ఆంక్షలు. సెమీ కండక్టర్లు, టెలీ కమ్యూనికేషన్, ఎన్క్రిప్షన్ సెక్యూరిటీ, లేజర్స్, సెన్సర్స్, నావిగేషన్, ఎవియానిక్స్, మారిటైమ్ టెక్నాలజీల సరఫరాపై నిషేధం. క్రెమ్లిన్‌కు అత్యంత సన్నిహితుల ఆస్తులపై నిషేధం. రష్యన్ బ్యాంకులపైనా ఆంక్షలు. రష్యా ఇంధన మేజర్ గాజ్‌ప్రామ్, ఆర్థిక సంస్థ స్బెర్ బ్యాంక్‌తోపాటు 13 రష్యా బ్యాంకులు నిధులు సేకరించకుండా ఆంక్షలు.
100 మంది రష్యన్లు, సంస్థల ఆస్తులు జప్తు. స్విఫ్ట్ సేవలు రష్యా పొందకుండా నిలిపివేత.
రష్యా జాతీయ విమానాల రాకపోకలపై నిషేధం.