Home
International
The Iranian Delegation En Route To Pakistan For Peace Talks With The United States Arrived In Islamabad Aboard An Aircraft Named Minab 168
రక్తసిక్తమైన బ్యాగులు, బాలికల ఫొటోలు.. మినాబ్-168లో పాక్‌కు ఇరాన్ బృందం
అమెరికాతో శాంతి చర్చల కోసం పాకిస్థాన్‌కు పయనమైన ఇరాన్ ప్రతినిధి బృందం మినాబ్-168 అని పేరు పెట్టిన విమానంలో ఇస్లామాబాద్ చేరుకున్నారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: అమెరికాతో శాంతి చర్చల కోసం పాకిస్థాన్‌కు పయనమైన ఇరాన్ ప్రతినిధి బృందం మినాబ్-168 అని పేరు పెట్టిన విమానంలో ఇస్లామాబాద్ చేరుకున్నారు. ఇరాన్ యుద్ధం మొదలైన మొదటి రోజైన ఫిబ్రవరి 28న ఇరాన్‌లోని మినాబ్ నగరంలోగల హాజారే తయ్యేబే ప్రాథమిక పాఠశాలపై క్షిపణి దాడి జరిగినపుడు 168 మంది మరణించారు.
వారిలో చాలామంది బాలికలు ఉన్నారు. ఆ బాలికలకు నివాళిగా విమానానికి ఆ పేరు ఇరాన్ ప్రభుత్వం పెట్టింది. ప్రతినిధి బృందం సభ్యులతోపాటు మరణించిన బాలికల ఫొటోలు, రక్తపు మరకలున్న స్కూల్ బ్యాగులు, ఇతర వస్తువులు కూడా ఉన్నాయి. ఆనాటి హృదయవిదారక ఘటనను గుర్తుచేస్తూ ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఘాలిబాఫ్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

