కనిష్ఠ స్థాయికి గ్రీన్‌కార్డుల ఆమోదం రేటు
అమెరికా చరిత్రలో రికార్డులో స్థాయిలో గ్రీన్‌కార్డుల ఆమోదం రేటు కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో కేవలం 3 శాతం దరఖాస్తులు మాత్రమే ఆమోదం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వాషింగ్టన్: అమెరికా చరిత్రలో రికార్డులో స్థాయిలో గ్రీన్‌కార్డుల ఆమోదం రేటు కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో కేవలం 3 శాతం దరఖాస్తులు మాత్రమే ఆమోదం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది సుమారు 3.7 కోట్ల అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రాక్టికల్‌గా చూస్తే 97 శాతం దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్టు తెలుస్తున్నది. ఏటా గ్రీన్ కార్డుల కోసం డిమాండ్ పెరుగుతున్నప్పటికీ కార్డుల జారీ సంఖ్య స్థిరంగా ఉంటున్నది.
గ్రీన్ కార్డుల జారీలో లాటరీ విధానం పాటిస్తుండటం వల్ల అదృష్టం కొం దరి తలుపు మాత్రమే తడుతున్నది. గ్రీన్‌కార్డుల్లో క్యాప్డ్, అన్ క్యాప్డ్ క్యాటగిరీలు ఉండటం వల్ల దరఖాస్తుదారుల జీవిత భాగస్వాములు, మైనైర్లెన పిల్లలు, తోబుట్టువులు వాటిని పొందడం కష్టమవుతున్న ది. ఈ పరిణామం అమెరికాలో స్థిరపడాలనుకుంటున్న భారతీయ ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతున్నది. అందుబాటులో ఉన్న అన్ని గ్రీన్‌కార్డులను జారీ చేయడంలో అమెరికా ప్రభుత్వం తరచూ విఫలం కావడమే ఇందుకు కారణం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

