బీజింగ్, ఆగస్టు 9: చైనాలోని ఉత్తర హెబే రాష్ట్రంలోని చెంగ్డే నగరంలో ఆంత్రాక్స్ నిమోనియా కేసు నమోదైంది. రోగిలో నాలుగు రోజుల క్రితమే లక్షణాలు కనిపించడంతో బీజింగ్‌కు తరలించారు. సదరు వ్యక్తికి ఆంత్రాక్స్ సోకినట్టు సోమవారం నిర్ధారణ అయింది. అంత్రాక్స్ ఓ బ్యాక్టీరియా. ఇది సోకిన గొర్రెలు, పశువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. దీనిపై ప్రభావవంతంగా పనిచేసే యాంటిబయాటిక్స్ అందుబాటులో ఉన్నాయి.