హనోయి: 62 ఏండ్ల నుంచి కంటి మీద కునుకు లేదని వియత్నాంకు చెందిన రైతు (81) చెప్పారు. 1962లో వియత్నాం యుద్ధం సమయంలో తనకు తీవ్ర స్థాయిలో జ్వరం వచ్చిందని, ఆ తర్వాత ఇక తాను నిద్రపోలేదని తెలిపారు. మందులు, నాటు సారా, మద్యం వాడినప్పటికీ తనకు నిద్ర పట్టడం లేదన్నారు. రాత్రి వేళల్లో ఇతరులంతా నిద్రపోతూ ఉంటే, తాను మాత్రం పొలంలో పనులు చేస్తానని, రైస్ వైన్‌ను తయారు చేస్తానని చెప్పారు.
రైస్ వైన్ తాగితే కాసేపు స్పృహ తప్పుతుందని తెలిపారు. దీనికి కారణమేమిటో వైద్యులు కూడా చెప్పలేకపోతున్నారని తెలిపారు. సుదీర్ఘ కాలం పాటు నిద్ర లేకపోతే బతకడం సాధ్యం కాదని శాస్త్రవేత్తలు అంటున్నారు. యుద్ధం తర్వాత ట్రమటిక్ స్ట్రెస్ వల్ల ఇలా జరుగుతూ ఉండవచ్చునని నిపుణులు చెప్తున్నారు.