కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడో సాయుధ సామ్రాజ్యంగా మారింది. ఎన్నికైన ప్రభుత్వ నేత దేశం విడిచి పారిపోవడంతో.. తాలిబన్ ఫైటర్లు ఆ దేశాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. ఆదివారం కాబూల్ ( Kabul ) నగరాన్ని ఆక్రమించడంతో .. ఆ పట్టణం ఇప్పుడు తాలిబన్ల హస్తాల్లోకి వెళ్లిపోయింది. అమెరికాపై 2001, సెప్టెంబర్ 11న జరిగిన దాడి తర్వాత.. ఆ దేశ బలగాలు ఆఫ్ఘనిస్తాన్‌లో తిష్టవేశాయి. తాలిబన్ ఫైటర్లను తరిమేందుకు ఆఫ్ఘన్ దళాలకు శిక్షణ ఇచ్చాయి. బిలియన్ల డాలర్లు ఖర్చు చేశాయి. తాజాగా అమెరికా దళాలు వెనుదిరగడంతో.. ఇప్పుడు ఆఫ్ఘన్లో పరిస్థితి మారింది. తాలిబన్లు మళ్లీ ఆఫ్ఘన్‌ను ఏలేస్తున్నారు. కాబూల్‌లో పరిస్థితి అస్తవ్యవస్థంగా తయారైంది. అధ్యక్ష భవనంలో తాలిబన్లు ఎంట్రీ ఇచ్చారు. కాబూల్ విమానాశ్రయానికి జనం పోటెత్తారు. వీధుల్లో ఆయుధాలతో తాలిబన్లు పహారా కాస్తున్నారు. పోలీసుల వాహనాలను స్వాధీనం చేసుకుని తిరుగుతున్నారు. నగరమంతా గందరగోళంగా మారింది. కాబూల్ ఎలా ఆ దేశ మిలిటెంట్లకు వశమైంది ఈ ఫోటోల్లో చూడండి.