లండన్, జూలై 11: 2000 ఏండ్ల క్రితమే క్యాన్సర్ వ్యాప్తి ఉన్నట్టు శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. ప్రపంచంలో మొట్టమొదటి గర్భి ణీ మమ్మీగా గుర్తింపు పొందిన ‘మిస్టీరియస్ లేడీ’ ఈ వ్యాధితోనే మరణించినట్టు పేర్కొన్నారు. కడుపులో పిండం 28 వారాల వయసులో ఉన్నప్పుడే క్యాన్సర్ కారణంగా ఆమె మరణించిందని చెప్పారు.