Flight tire : అగ్రరాజ్యం అమెరికా (USA) కు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ‘యునైటెడ్ ఎయిర్‌లైన్స్ (United Airlines)’ కు చెందిన ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయం (Orlando International Airport) లో విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో దాని టైరు ఊడిపడింది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.
వివరాల్లోకి వెళితే.. చికాగోలోని ఓహేర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఓర్లాండోకు సిబ్బందితో సహా 206 మంది ప్రయాణికులతో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం బయల్దేరింది. ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా సాంకేతికలోపం తలెత్తడంతో ముందు టైరు ఊడిపోయి రన్‌వేపై పడింది. అప్రమత్తమైన పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విమానంలో నుంచి ప్రయాణికులను సురక్షితంగా దించేశామని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు.
విమానాన్ని రన్‌వే పైనుంచి తొలగించడానికి బృందాలను మోహరించినట్లు అధికారులు తెలిపారు. దాంతో పలు విమానాలు ఆలస్యంగా బయలుదేరాయని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) అధికారులు వెల్లడించారు. సాంకేతిక లోపానికి కారణం ఇంకా తెలియలేదని, ఓర్లాండోలోని ప్రతికూల వాతావరణ పరిస్థితులు కూడా దీనికి కారణం కావచ్చని అనుమానం వ్యక్తంచేశారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
CrashVision: Major Crash Averted!
📡 What We Know: A United Airlines flight narrowly avoided disaster during a landing at Orlando International Airport (MCO) after a nose wheel appears to detach from the front landing gear! Looks like a hard landing. No injuries were reported. pic.twitter.com/qqhPy12v1k— John Cremeans (@JohnCremeansX) January 19, 2026