Viral video | సాధారణంగా మనుషులు చేసే కొన్ని దొంగతనాలు పతాక శీర్షికల్లో నిలుస్తుంటాయి. దొంగతనానికి వచ్చి మద్యం మత్తులో ఆదమరిచి నిద్రించే దొంగల గురించి, ఇల్లును లూటీ చేసి ఆ ఇంటి యజమానికి సారీ అంటూ లెటర్ రాసి పెట్టే దొంగల గురించి, దొంగిలించిన సొమ్మును మూటగట్టిన తర్వాత వంట చేసుకుని తిని పోయిన దొంగల గురించి చాలా వార్తలు వచ్చాయి. అదేవిధంగా అప్రమత్తంగాలేని వ్యక్తుల చేతుల్లోంచి కోతులు ఆహార పదార్థాలను ఎత్తుకెళ్లే తమాషా ఘటనలు కూడా చాలా జరగుతుంటాయి. కానీ ఒక పక్షి దొంగతనం చేయడాన్ని మీరు ఎప్పుడైనా చూశారా..?
కానీ, చైనాలో ఓ పక్షి తెలివిగా దొంగతనాలు చేస్తోంది. ఈ పక్షి దొంగతనానికి సంబంధించిన ఓ వీడియోను అటహరెకట్ పేరుతో ట్విటర్ (X) ఖాతాలో పోస్టు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆగస్టు 31న పోస్ట్ అయిన వీడియోకు ఇప్పటి వరకు 24 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. నెటిజన్ల నుంచి రకరకాల కామెంట్ల వర్షం కురుస్తున్నది.
ఈ వీడియోలో నలుపు రంగులో ఉన్న ఓ పక్షి కరెన్సీ నోట్లను నోట కరుచుకుని బయటి నుంచి ఎగురుకుంటూ తన యజమాని ఇంట్లోకి వస్తుంది. అక్కడి ఓ టేబుల్ ముందు వాలి సొరుగు తెరుచుకునేదాకా వేచిచూస్తుంది. ఆ సమయంలో ఆ ఇంటి పెంపుడు కుక్క టేబుల్ వెనుక నుంచి సొరుగును ముందుకు నెడుతుంది. తర్వాత పక్షి ఆ సొరుగుపై వాలి తాను తెచ్చిన కరెన్సీ నోట్లను అందులో వేస్తుంది.
ఇలా ఆ సొరుగును పెద్ద మొత్తంలో నగదుతో నింపేసింది. పక్షి చేసే ఈ తమాషా తతంగాన్నంతా పెంపుడు కుక్క నిశితంగా పరిశీలిస్తుంది. మరెందుకు ఆలస్యం 13 సెకన్ల నిడివిగల ఈ ఫన్నీ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..
Çin’de bir adam, kuşuna sokaktan para çalıp eve getirmeyi öğretti. 😂😂 pic.twitter.com/ba1p0A2aNu
— Ataharekat 🇹🇷 (@ataharekat) August 31, 2023