న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) మరోసారి కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య కాల్పుల విమరణ జరిగినట్లు ఆయన మళ్లీ స్పష్టం చేశారు. కాసేపటి క్రితం తన సోషల్ మీడియా అకౌంట్ ట్రుత్ సోషల్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య తక్షణమే కాల్పుల విరమణ అమలులోకి వచ్చినట్లు తన పోస్టులో ట్రంప్ తెలిపారు. దీన్ని ఎవరూ అతిక్రమించరాదు అని ఆయన కోరారు. ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య కుదిరిన ఒప్పందంపై ట్రంప్ మరో పోస్టు చేశారు. ఆ డీల్ కుదరడానికి కారణాన్ని వివరించారు. బీ2 స్పిరిట్ పైలట్ల ధైర్యం, తమ టాలెంట్‌తోనే ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఆపరేషన్‌లో పాల్గొన్నవారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అణుకేంద్రాలపై జరిగిన దాడిని పర్ఫెక్ట్ హిట్‌గా పేర్కొన్నారు. ఆ తర్వాత రెండు దేశాల మధ్య డీల్ జరిగినట్లు చెప్పారు.
కాల్పుల విరమణపై ట్రంప్ ప్రకటన చేసినా.. ఇజ్రాయిల్ మాత్రం దీన్ని అంగీకరించినట్లు అధికార ప్రకటన చేయలేదు. ఇజ్రాయిల్‌పై కాల్పుల విరమణపై ఒప్పందాన్ని రుద్దే ప్రయత్నం జరిగినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది.